రైతుల శ్రేయస్సు కోసమే సహకార సంఘాలు

15-09-2026 | 06:16pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): రైతుల శ్రేయస్సు కోసమే సహకార సంఘాలు(Cooperative societies) పనిచేస్తున్నాయని కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలం అచ్చంపేట సహకార సంఘ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం అచ్చంపేట సహకార సంఘ మహాజన సభను ఉద్దేశించి మాట్లాడుతూ... రైతులు సహకార సంఘం ద్వారా విక్రయించే ఎరువులను కొనుగోలు చేయాలని, సూచించారు. అచ్చంపేట సంఘ పరిధిలోని అచ్చంపేట గ్రామంలో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని సభ్యులు కోవడంతో అందుకు అంగీకరించారు. కార్యక్రమంలో అచ్చంపేట సర్పంచ్ సంకు లక్ష్మయ్య, సొసైటీ సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు