4 May, 2026 | 3:07 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

మొక్కజొన్న పంట డబ్బులు చెల్లించాలి

06-03-2026 02:29 AM
  1. అఖిల పక్ష నాయకులు

కామారెడ్డి జిల్లా గాంధారిలో ధర్నా చేసిన రైతులు

గాంధారి, మార్చి 5(విజయక్రాంతి) : కా మారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మొక్కజొన్న రైతుల పంట డబ్బులు సత్వరమే చెల్లించాలని అఖిల పక్షం నాయకులు మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన మొక్క జొన్న పంట డబ్బులు ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం ఏంట ని వారు ప్రశ్నించారు.

ఆరుగాలం చెమటో డ్చి కష్టపడి పండించిన పంటలు  అమ్ముకుని మూడు నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ స్పందించాలని డిమాండ్ చేశా రు.

ఈ సందర్భం గా మార్క్‌ఫెడ్ డీఎంతో అఖిల పక్షం నాయకులు ఫోన్లో సంప్రదించగా వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, సాయి బాబా, గంగి రమేష్,   రెడ్డి రాజులు, నాగ్లూర్ సాయి లు, పోతంగల్ కిషన్ రావ్,  ఆకుల స్వామి, దర్భస్తు రవి   పాల్గొన్నారు.