కార్పొరేట్ జీయం కవిత నాయుడును కోరిన
టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్
మణుగూరు, డిసెంబర్ 5,( విజయక్రాంతి): ఏరియాలో ఖాళీగా ఉన్న ఛార్జర్ సేఫ్టీ ల్యాంపు ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని కార్పొరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్ )కవిత నాయుడు ను శుక్రవారం ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు కలసి విజ్ఞప్తి చేశారు.
2024 లో మణుగూరు ఏరియా లో ఖాళీగా ఉన్న ఛార్జర్ సేఫ్టీ ల్యాంపు పోస్ట్ ల కోసం అర్హత గల ఏరియా కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని వాటిని అధికారులు భర్తీ చేసే సమయంలోనే కార్పొరేట్ అధికారుల నుంచి వాటిని నిలుపుదల చేయాలని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వాటిని నిలుపు దల చేయాలని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందని ఇప్పటి వరకు వాటి పై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఆ పోస్ట్ లకు అర్హత ఉన్న ఏరియా కార్మికులు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే సమయంలో జనరల్ అసిస్టెంట్ లనే ప్రామాణికంగా తీసుకొని పోస్ట్ లు భర్తీ చేయాలని కోరారు. టి బి జి కె యస్ చేసిన విజ్ఞప్తి పై కవిత నాయుడు సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు.






