calender_icon.png 5 December, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు సభ్యులుగా జయరాం నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

05-12-2025 10:45:57 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని తాళ్ల మల్కాపురం గ్రామపంచాయతీ పదవ వార్డ్ సభ్యులుగా బానోతు జయరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రేగులగడ్డ తండా గ్రామానికి చెందిన బానోతు జయరాం నాయక్ పదవ వార్డు సభ్యునిగా సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ జయరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్లు ప్రక్రియ చివరి రోజు అయిన శుక్రవారం సాయంత్రం సమయం ముగిసే వరకు ఒకే నామినేషన్ రావడం,మరో నామినేషన్ ఎవరు దాఖలు చేయకపోవడంతో జయరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది.మండల వ్యాప్తంగా 33 గ్రామ పంచాయతీలు ఉండగా ఒకే ఒక వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం విశేషం.ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.