అక్రమంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?
-నిబంధనలు బేఖాతరు
- చోద్యం చూస్తున్న అధికారులు
- ప్రభుత్వ భూముల్లో ఎల్ ఇళ్లు..
-స్థానికేతరులకు ఇందిరమ్మ ఇళ్లు
-కాంగ్రెస్- లీడర్లే గుత్తేదారులు
బెల్లంపల్లి అర్బన్, డిసెంబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి గాడితప్పుతున్నది. ఇందిరమ్మ ఇళ్లు మం జూరు నుంచి నిర్మాణాల వరకూ అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. తొలి విడతగా ఎల్ 1 కింద ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేశారు. బెల్లంపల్లిలో తొలివిడతగా 680 ఇళ్లు మంజూరు అయ్యా యి.
ఇందులో పొరపాట్లు జరిగాయని స్వయాన అధికార పార్టీకి చెందిన మాజీ మునిసిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికార పార్టీ పెద్దలు పెద్దఎత్తునా అవినీతి అక్రమ వసూళ్లకు తెగబడ్డారనేది బహిరంగ రహస్యమే. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నుంచి మొదలైన అక్రమాలు, అవినీతి నిర్మాణాల వరకూ అదే తీరు కొనసాగుతున్నది. పెద్దపల్లికి చెందిన ఓ వ్యక్తికి బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇదెలా సాధ్యమని ఆద్యంతం విస్మయం వ్యక్తం చేశారు.
లీడర్లే గుత్తేదారులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కొందరు లబ్ధిదారులు గుత్తేదారులతో నిర్మించుకుంటున్నా రు. నిబంధనల మేరకు జరుగుతున్న ఇళ్లకు నిధులు మం జూరు జరగాలి. కొంత మేరకు జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. కొందరూ గుత్తేదారులు మాత్రం నిబంధనలను అస్సలు పాటించడం లేదు. ఇలాంటి వారి విషయంలో అధికారు లు చూసీచూడనట్టు ఉంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
గుత్తేదారు లు అక్రమ పద్ధతుల్లో సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికార యంత్రాం గం ఎలా బిల్లులు మంజూరు చేస్తుందనేది ఇక్కడ చర్చ జరుగుతున్నది. లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకుంటున్న ఇళ్ళ నిర్మాణ పద్ధతుల్లో కొంత తేడా కనిపిస్తే చాలు బిల్లులు నిలిపివేస్తున్న అధికారులు, నిబంధనలు తప్పి ఇళ్లు నిర్మిస్తోన్న గుత్తేదారుల విషయం లో మౌనంగా ఉంటున్నారు. అంతే కాదు వారికి బిల్లులు కూడా సక్రమంగా విడుదల చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు
ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ దందా జోరుగా సాగుతున్నది. అందుకోసం ప్రభు త్వ భూముల ఆక్రమణకు తెగబడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా లబ్ధి దారులకు సొంత స్థలం లేనివారిని ఎంచుకుంటున్నారు. వారితో ఒప్పందం చేసుకుని ఇలా నిబంధలను ఉల్లంఘించి ఆక్రమణ స్థలాల్లో అనేక కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. కొందరు కాంగ్రెస్ లీడర్లు, వారి దత్తపుత్రులే గుత్తేదారులుగా మారిపోయారు. తమ పలుకుబ డినీ ఆయుధంగా చేసుకొని ప్రభుత్వ భూముల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెగబడుతున్నారు.
పట్టణంలోని ఓ బస్తీలో ఈ నిర్మాణాల తీరుపై పెద్దఎత్తున చర్చ దుమారం లేపుతుంది. అటు అధికారులు, ఇటు ప్రజాపతినిధులు ఈ అక్రమ నిర్మాణాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. రాంనగర్ లో ప్రభుత్వ భూమిలో ఎల్ వన్ కింద మంజూరైన కొన్ని ఇద్దరమ్మ గృహాలను ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే కాకుండా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించి వాటిని అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.
ఇలా ప్రభుత్వ భూము ల్లో వ్యక్తిగత ఇందిరమ్మ పథకం నిర్మాణాల పై అధికారులు ఎలా అనుమతిస్తున్నారనేది అంతు పట్టని విషయమేమీ కాదు. అధికార పార్టీ మనుషులు కావడంతోనే అడ్డు చెప్పలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట నిర్మాణాలు చేయొచ్చునా..?అనే ప్రతి వాదనలు, ప్రశ్నలు స్థానికుల్లో వ్యకం అవుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న గుత్తేదారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇండ్లు నిర్మించి విక్రయించడం మరీ పెద్దనేరమే అవుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతే కాకుండా వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇటీవల ఓ రోజంతా ఇళ్ల నిర్మాణాల తీరుపై వేడివాడిగా చర్చోపచర్చలు జరిగిన సంగతి తెలిసిందే.






