కార్పొరేట్ మోడల్ బస్టాండ్లు

17-09-2026 | 05:30am
  1. వినోదానికి, షాపింగ్‌కు కేరాఫ్‌గా 13 హైటెక్ బస్టాండ్లు
  2. మల్టీప్లెక్స్ రేంజ్‌లో హంగులు
  3. టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మారే కాలానికి అనుగుణంగా ఆర్టీసీ(RTC) తన రూపురేఖలను సమూలంగా మార్చేస్తోంది. బస్టాండ్లు అంటే కేవలం ప్రయాణా నికే పరిమితం కాకుండా.. వ్యాపారం, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల కలయికగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్(Integrated Transit System) విధా నంలో 13 నూతన హైటెక్ బస్ స్టేషన్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది.

ప్రయాణికు లకు రైల్వేతో పాటు ఇతర రవాణా వ్యవస్థ(Transport system)లతో అనుసంధానం కల్పిస్తూ, ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించాయి. 

మల్టీప్లెక్స్ రేంజ్ హంగులు

ఈ బస్టాండ్లలో మల్టీప్లెక్స్ రేంజ్ హంగు లు ఉండబోతున్నాయి. గతంలో బస్టాండ్ అంటే గుర్తొచ్చే ఇరుకు ప్రదేశాలు, అసౌకర్యాలకు ఇక చెక్ పడనుంది. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రయాణికులకు లభించనున్నాయి. బస్సు దిగగానే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునే సదుపా యం ఉండనుంది. స్థానిక, ప్రముఖ వ్యాపారులు తమ బిజినెస్ విస్తరణ కోసం వాణిజ్య సముదాయాలు (కమర్షియల్ స్పేస్) ఉం టాయి. వీటితో పాటు ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదాన్ని పంచే గేమిం గ్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఉండనున్నాయి.

ఈ నూతన హైటెక్ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటా యింపు కోసం ఆసక్తిగల వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాలు ఆధునిక హంగులతో కొత్త కళను సంతరించుకోనున్నాయి. త్వరలోనే ఈ మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 

నూతన బస్ స్టేషన్లు ఏర్పాటు కానున్న 13 ప్రాంతాలు

నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్లగొండ, కొత్తగూడెం.

మరిన్ని వార్తలు