15 April, 2026 | 4:55 PM

ఎమ్మెస్సార్ విజయం

14-02-2026 01:22 AM

11 డివిజన్ పైనే అందరి చూపు 

డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటారన్న కార్పొరేటర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మొదటినుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి 11వ డివిజన్ నుంచి పోటీ చేయడంతో అందరిచూపు అటువైపే ప్రత్యేకంగా అందరి చూపు అటువైపు మళ్ళింది.

కొందరు మారేపల్లి సురేందర్ రెడ్డిని ఓటమిపాలు చేయాలని చూశారని కార్పొరేటర్ మారేపల్లి సురేందర్ రెడ్డి విజయం సాధించిన అనంతరం ప్రకటించడంతో గతంలో తెరలేపిన ప్రచారానికి మరింత పదును ఎక్కింది. బండమీదిపల్లి 11వ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తనను నమ్మి గెలిపించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఎమ్మెస్సార్ కృతజ్ఞతలు తెలియజేశారు.