14-02-2026 01:22:32 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు ఈ మేరకు చొప్పదండి పురపాలక సంఘం బరిలో నిలిచి గెలిచిన పదిమంది అభ్యర్థులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన ప్రత్యేకంగా సన్మానించి అభినందించి మాట్లాడారు. అధిష్టానం పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే చొప్పదండి పురపాలక సంఘంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేయడం అర్షనీయమని పేర్కొన్నారు పార్టీలో అంకుటితంగా పనిచేసిన వారికి మంచి గు ర్తింపు ఉంటుందని తెలిపారు .
ఈ సందర్భంగా గెలుపొందిన వడ్లూరి సరిత శ్రీనివాస్, కొట్టే సు నీత అశోక్, కన మల్ల రాజశేఖర్, వడ్లూరి అనూష శ్యాంసుందర్, ఒలుగొత్తుల సురేష్, గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, పిట్టల వెంకటేష్, ముద్దం రాజేశ్వరి తిరుపతి గౌడ్, పెరుమం డ్ల పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్ లను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ పట్టణ శాఖ అధ్యక్షులు నిజానపురం చందు పలువురు నాయకులు పాల్గొన్నారు.