పంట నష్టం భయంతో రైతు ఆత్మహత్య

17-09-2026 | 11:38am

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): గతేడాదిగా వ్యవసాయంలో వరుస పంట నష్టం చవిచూ శాడు రైతు..ఈ ఏడాది కూడా పత్తి సాగు(Cotton Cultivation) చేశాడు. అదే ఆయన కు శాపంగా మారింది. పంట సాగులో తీవ్రంగా నష్టపోతున్న పత్తి రైతు ఈ ఏడాదికూడా నష్టం వస్తుందనే భయంతో చేసుకున్న సంఘటన బెల్లంపల్లి మండలంలో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఇంద్రనగర్ లో పోగుల శంకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు రైతుకు కన్నెపల్లి మండలంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. పత్తి సాగులో రెండేళ్లుగా నష్టం పోతున్నాడు. పంట నష్టం విషయంలో తీవ్ర  మనస్థాపానికి గురయ్యాడు.  ఈ ఏడాది పంట పరిస్థితి పై ఆందోళన చెందాడు. గత పంట నష్టం భయం నుంచి బయట పడని ఆయన ఎక్కడా పంట నష్టం వస్తుందో అని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు