7 March, 2026 | 9:18 AM

పత్తి కొనుగోళ్లు అంతంతే

07-03-2026 01:36 AM

28.29 లక్షల టన్నుల లక్ష్యం

  1. కొనుగోలు చేసింది 16.15  లక్షల టన్నులే..
  2. సీసీఐ కొర్రీలు, నిబంధనలతో ప్రైవేట్‌కే రైతుల మొగ్గు
  3. అడ్డంకిగా మారిన మద్దతు ధర నిబంధనలు

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల రాష్ట్రంలో పత్తి రైతులకు ఈ సీజన్ కష్టాలు, నష్టాలే మిగిలాయి. జిన్నింగ్ మిల్లుల్లోని కొనుగోలు కేంద్రాల ప్రారంభం మొదలుకొ ని.. పత్తి కొనుగోలు ముగిసేవరకు రైతులకు ఇబ్బందులే తలెత్తాయి. దీంతో పత్తి సేకరణ విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పెట్టిన కొర్రీలు, నిబంధనలు రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.

దీంతో పత్తి సేకరణ లక్ష్యాన్ని సర్కార్ చేరుకోలేకపోయిం ది. వాస్తవానికి ఈ సీజన్‌లో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లుగా అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అందుకుగాను 28.29 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ లక్ష్యంగా పెట్టుకొన్నది. కానీ పత్తి కొనుగోలు ముగిసేవరకు.. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 8.80 లక్షల మంది రైతుల నుంచి 16.15 లక్షల టన్ను లనే సీసీఐ కొనుగోలు చేసింది.

అంటే లక్ష్యం కన్నా 12.12 లక్ష ల టన్నుల పత్తిని తక్కువగా కొనుగోలు చేసింది. గతేడాది 28.30 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టు కోగా, 21.01 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. లక్ష్యంలో 74.24 శాతం పత్తిని కొనుగోలు చేసింది. గతం కంటే ఇప్పుడు పత్తి కొనుగోలు భారీగా తగ్గింది. అంతే కాకుండా రైతులకు రూ. 9,919 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇంత భారీ విలువైన పత్తిని రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. కానీ,  ఈ ఏడాది 56.77 శాతానికే పరిమితమైంది. అంటే నిరుటితో పోల్చితే ఈ ఏడాది 17.45 శాతం తక్కువగా పత్తిని కొనుగోలు చేసినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి.  

అడ్డంకిగా మారిన నిబంధనలు..

పత్తి కొనుగోలు పరిమితి ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలుతో పాటు 12 శాతం  తేమ నిబంధన కూడా పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేశాయి.  అప్పటికే వర్షాలతో పత్తి మొత్తం తడిసి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తేమ శాతం 12 వరకు ఉంటే కొనుగోలు చేస్తామని, లేకపోతే ఒక్క దూది పింజను కూడా కొనుగోలు చేసే ప్రసక్తేలేదని సీసీఐ తేల్చి చెప్పింది.

తేమ శాతం 15 నుంచి -20 శాతం వరకు పెంచాలని రైతులు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో ఓవైపు పత్తి తడిసి, మరోవైపు కొనుగోలుకు సీసీఐ నిరాకరించడంతో కాంటా వేయడానికి ఆలస్యమైన కొద్ది పత్తి రంగు మార డంతో  తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించిన రైతులు  నష్టాల పాలయ్యారు.  నవంబర్ మొదటివరకు ఎకరానికి 11.74 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ..

ఆ తర్వాత దీన్ని 7 క్వింటాళ్లకు కుదించింది.  మిగిలిన పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ ని రాకరించడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి పరిస్థితి  వచ్చింది. అంతే కాకుండా  2 నుంచి 3 లక్షల మందికి మించి రైతులకు గరిష్ఠ మద్దతు ధర రూ. 8,110 దక్కలేదనే ఆరోపణలు ఉన్నా యి. ఇందుకు  తేమ పేరుతో కొర్రీలు పెట్టడమే ప్రధాన కారణమని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.

తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర..  

ఇక పత్తి   తేమ శాతానికి అనుగుణంగా  రూ. 7,786 నుంచి రూ. 8,110 వరకు మద్దతు ధర నిర్ణయించింది. ఇందులో 8 శాతం, ఆలోపు తేమ ఉంటే గరిష్ఠ మద్దతు ధర రూ. 8,110 దక్కుతుంది. 9 శాతం తేమ ఉంటే రూ. 8,029, 10 శాతానికి రూ. 7,948, 11 తానికి రూ.7,867, 12 శాతం తేమ ఉంటే రూ. 7,786 చొప్పున మద్దతు ధరగా నిర్ణయించింది. కొన్ని చోట్ల తేమ తక్కువగా వచ్చినప్పటికీ సీసీఐ అధికారులు ఎక్కువగా చూపి రైతులకు అన్యాయం చేసినట్టు తెలిసింది.

దీంతో రైతులు చేసేదేమి లేక తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితిని కల్పించింది. మద్దతు ధర రూ. 8.110 ఉండగా రైతులు రూ.6 వేలకే బయట విక్రయించారు. ఓవైపు సీసీఐ తమ కొర్రీలతో రైతులను ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు రైతులకు బాసటగా నిలువాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూసిందని రైతుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి