15 April, 2026 | 10:39 AM

షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి

29-10-2025 05:59 PM

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎటువంటి తేమ పరీక్ష లేకుండా పూర్తిస్థాయిలో రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కు బుధవారం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ప్రణయ్ మాట్లాడుతూ  వ్యవసాయం పై ఈ ఏడాది వాతావరణ దుష్ప్రభావం పడిందన్నారు.

ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి చెట్లకు ఖాతా, పూత విపరీతంగా రాలిపోయి పంట కేవలం 20% నుండి 30% మాత్రమే దిగుబడి వచ్చేలా ఉంది దీంతో రైతులకు కనీస పెట్టుబడి డబ్బులు కూడా వచ్చేలా లేవు కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రైతులని కోలుకోలేకుండా చేస్తున్నాయని కావున మీరు చొరవ తుసుకొని ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి తేమ పరీక్ష లేకుండ పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేసే విధంగా దోహదపడాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, బీసీ యువజన సంఘం జిల్లా నాయకులు బొట్టుపల్లి సాయి కృష్ణ, పిప్పిరి సమ్మన్న,గుడికందుల రాము తదితరులు ఉన్నారు.