తొగర్రాయి వేణుగోపాలస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు
25-07-2026 08:23 PM
చైర్మన్ సరస్వతి మదన్మోహన్
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సరస్వతి మదన్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని తీర్దప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం భజనలు నిర్వహించారు. ప్రజలు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లిక్కి గురవమ్మ వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి సులోచనరావు, కార్యదర్శి నరేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జడ వెంకటేశ్వర్లు, నర్సింహారావు, అర్చకుడు బాబు సార్, కొండలు, వెంకన్న, వీరబాబు, వేలాద్రి, మమత లింగయ్య గ్రామస్తులు పాల్గొన్నారు






