4 May, 2026 | 6:16 PM

Breaking News

ఆసుపత్రిలో నిరీక్షణాలయం ప్రారంభం   •   వర్షానికి తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది   •   ఎస్పీని కలిసిన డిఎస్పి అశోక్   •   కార్మిక చట్టాలను వినియోగించుకొవాలి: జడ్జి దుర్గం గణేశ్   •   సరస్వతీ పుత్రుడు సన్మానించిన నాయకులు   •   ప్రపంచ నవ్వుల దినోత్సవంలో డాక్టర్ తోకల రమేష్‌కు ఘన సత్కారం   •   లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం పుష్పయాగం, పవళింపు సేవ   •   త్రివేణి పాఠశాల విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు   •   రైతు వారోత్సవానికి రైతులు దూరం… వెలవెలబోయిన రైతు వేదిక   •  

పోలీస్ స్టేషన్ ముందు దంపతుల ఆత్మహత్యయత్నం

10-08-2024 10:52 AM

విజయక్రాంతి, లక్షెట్టిపేట్:  పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పాక చిలకమ్మా, భూమయ్య అనే దంపతులు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన కలకలం రేపింది.  బాధితులు తెలిపిన  వివరాల ప్రకారం, తిమ్మాపూర్ శివారులో సర్వే నెంబర్ 461, 462 లలో తమ భూమి సమస్య పరిష్కారంలో అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో క్రిమిసంహారక మందు డబ్బాతో వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యయత్నం చేశారు. తమ భూమిని నెరెళ్ళ సురేష్ అనే వ్యక్తి ఆక్రమించారని బాధితులు తెలిపారు. నేరెళ్ల సురేష్ పై రౌడీ షీట్ ఉందని తమను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆ దంపతులు గోడు వెళ్ళబోసుకున్నారు.

మేము గత మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం వలననే తమ పొలాన్ని, పైపులను ధ్వంసం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యయత్నంపై ఎస్సై సతీష్ ను వివరణ కోరగా, బాధితులు గురువారం పిటిషన్ ఇచ్చారని, ఇప్పటికే కౌంటర్ కేసు నమోదు అయినందున విచారణ జరుపుతున్నామని వివరించారు. బాధితులు శాంతించకపోగ సీఐ నరేందర్ వచ్చి తాను స్వయంగా కేసును పర్యవేక్షిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.