25 May, 2026 | 1:54 AM

ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన సీపీ

25-05-2026 01:12 AM

హనుమకొండ అర్బన్, మే 24 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హనుమకొండ నగరానికి తొలిసారిగా విచ్చేసిన వేం నరేందర్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నేరాల నియంత్రణతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకై చేపడుతున్న చర్యలపై పోలీస్ కమిషనర్ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి వివరించారు.