25 May, 2026 | 1:55 AM

స్పృహ తప్పిన మహిళను ఆసుపత్రికి చేర్చిన కాజీపేట ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్

25-05-2026 01:10 AM

హనుమకొండ, మే 24  (విజయక్రాంతి): హంటర్ రోడ్ లోని డి కన్వెన్షన్ హల్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించేందుకు వచ్చిన మహిళ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిట్టల వెంకన్న స్పృహతప్పి పడిపోయిన మహిళను గమనించి  తక్షణమే స్పందించి 108 కు సమాచారం అందించి స్పృహ తప్పిన మహిళకు చికిత్స అందించేందుకు అంబులెన్స్ లో హాస్పటల్ తరలించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్పందించిన తీరు పట్ల స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.