16 April, 2026 | 7:21 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కొండపల్లి శ్రీధర్ రాజీనామాను ఆమోదించిన సీపీఎం జిల్లా కమిటీ

02-03-2026 12:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

పాల్వంచ, మార్చి 1 (విజయక్రాంతి): సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీకి లేక ఇచ్చినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీధర్ ఇచ్చిన రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకున్న పార్టీ అతని రాజీనామాను వెనక్కి తీసుకునే విధంగా అతనితో చర్చించి  అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తాను రాజీనామాను వెనక్కి తీసుకోలేనని చెప్పాడని తెలిపారు.

శ్రీధర్ పార్టీకి ఇచ్చిన రాజీనామా లేఖను తప్పని స్థితిలో పార్టీ జిల్లా కమిటీ ఆమోదించి నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా పాల్వంచ సిపిఎం కార్యాలయం లో పట్టణ కమిటీ సభ్యులు నిరంజన్ అధ్యక్షత న జరిగిన పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశం లో పై విషయాలను వివరించారు. ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 31 డివిజన్ లో ఓటమి గల కారణాలను పార్టీ సమీక్షిస్తుందని తెలిపారు. జరిగిన పొరపాటు లను సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు ఉద్యమాలు రూపొందిస్తుందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పై పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మార్చి 1 నుండి 20 వరకు ప్రజా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఇందు కోసం పార్టీ శాఖలు, గ్రామ సదస్సులు నిర్వహించాలని శ్రేణులను కోరారు.

ఈ సదస్సులో లేబర్ కోడ్ లు, ఉపాధి పథకం మార్పు, రైతాంగ సమస్యలు, విత్తన, విద్యుత్ చట్టాల ను తీసుకురావటం వంటి అంశాలపై ప్రజలలో చైతన్యం తీసుకు రావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా రవికుమార్, పట్టణ నాయకులు సత్య, వాణి, క్రాంతి, మాధవి, కృష్ణమూర్తి, విష్ణు, రహమాన్, యాకుబ్, కుమారి తదితరులు పాల్గొన్నారు.