2 March, 2026 | 10:22 AM

కార్పొరేషన్ ఎలక్షన్‌లో మాదిగలకు తీవ్రంగా అన్యాయం

02-03-2026 12:00 AM

రేవంత్ యువసేన అధ్యక్షులు వానపాకుల రాంబాబు

పాల్వంచ, మార్చి 1 (విజయక్రాంతి): పాల్వంచలోని 27 డివిజన్లో ఒక్క డివిజన్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి కార్పొరేటర్లుగా నియమించకపోవడం కాంగ్రెస్ మాదిగల పై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పార్టీ బలహీన పడినదనీ రేవంత్ యువసేనా జిల్లా అధ్యక్షులు వానపాకుల రాంబాబు ఆరోపించారు.

ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.  సిపిఐ పార్టీ మూడు డివిజన్లో మాదిగ సామాజిక వర్గానికి బీ ఫాములు ఇచ్చి మాదిగల సానుభూతి పొందటం వల్ల  సిపిఐ పార్టీ బంపర్ మెజార్టీతో మేయర్ పదవిని అలంకరించడం జరిగినదన్నారు. ఈ నిర్లక్ష్యం వలన పాల్వంచలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వలసవాదులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మాదిగ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ అవమానాలకు గురిచేస్తూ పదవులకు పార్టీలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాదిగల లావణ పట్టా భూములు ఉన్నటు వంటి  817 సర్వేనెంబర్ భూమి 727 సర్వేనెంబర్ భూమిలో రేవంత్ నగర్ గా నామకరణ చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ యువసేన నాయకత్వంలో గుడిసెలు నిర్మించి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకు, కాంగ్రెస్ పార్టీని గద్దలెక్కించే వరకు పోరాడాలని  ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారి ఆదరణతో  కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత వలసవాదులు, అగ్రవర్ణాలు ఈ పార్టీలో చేరి సామాజికంగా మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  మాదిగల భూములు గుంజుకున్న భూ కబ్జాదారుల్ని పార్టీలో చేర్చుకొని అవమానాలు పరుస్తూ సామాజిక మాదిగ వర్గాన్ని పార్టీకి దూరం చేస్తున్నారన్నారు.