15 June, 2026 | 6:13 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

గ్యాస్ కొరతపై సీపీఎం వినూత్న నిరసన

19-03-2026 01:14 AM

ఘట్ కేసర్, మార్చి 18 (విజయక్రాంతి) : వంట గ్యాస్ కొడతను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత ఆరోపించారు. బుధవారం పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో సిపిఎం కార్యకర్తలు వంటగ్యాస్ పక్కనపెట్టి కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సబిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టుపెట్టి అమెరికా, ఇజ్రాయిల్ లకు లొంగుబాటు వైఖరి వల్ల వంటగ్యాస్ సంక్షోభం ఏర్పడిందన్నారు.

ఫలితంగా హోటల్లు, టీ దుకాణాలు ఇతర చిరు వ్యాపారులకు గ్యాస్ కొరత ఏర్పడి ఫలితంగా వాటి ధరలు దారుణంగా పెరిగాయన్నారు.  తక్షణమే బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించి న్యాయంగా అవసరమైన ప్రతి ఒక్కరికి వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. అలివేల, అరుణ, సునీతదేవి, నాగమణి, శ్రావణి, పర్వీన్, ప్రమీల, శోభ, స్వరూప, సాలమ్మ, కలమ్మ, పద్మ, నవనీత,  రేణుక, ఫర్జాన పాల్గొన్నారు.