15 June, 2026 | 7:21 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

అన్ని దానాలకన్న అన్నదానం మిన్న

15-06-2026 06:37 PM

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ 

మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ 

సుల్తానాబాద్,(విజయశాంతి): అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు కొమురవెల్లి భాస్కర్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలోని వికలాంగులకు అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిలుగా హాజరైన బిరుదు రాధాకృష్ణ, అయిల రమేష్ లు మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు.