శ్రీపాద వల్లభ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
19-03-2026 01:13 AM
ట్రస్టు చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా
మేడ్చల్ అర్బన్ మార్చి 18 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని ఏడు గూళ్ల అమ్మవారి ఆలయం వద్ద మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీపాద వల్లభ ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజున ఒక పూట కడుపునిండా అన్నం పెడుతున్న శ్రీపాద వల్ల ట్రస్టు ఎవరు కూడా ఆఖరితో దప్పికతో ఉండకూడదని శ్రీపాద వల్ల ట్రస్టు లక్ష్యం చేసుకుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈ నేపథ్యంలో నర్సింలు పటేల్.శ్రీరామ సైకిల్ స్టోర్ ప్రోప్రైటర్ చోల్లేటీ రవికుమార్ శేఖర్ పటేల్.నర్సింగ్ రావు.మల్లికార్జున స్వామి.సంతోష్ గుప్తా.శంకర్.లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.




