సైబర్ మోసాలపై సిబ్బందికి అవగాహన

11-09-2026 | 05:25am

ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమ నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (Nizamabad District Cooperative Central Bank Limited) ప్రధాన కార్యాలయంలో గురువారం సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ రవి నాయుడు హాజరై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

వోటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించకపోవడం, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, ఈ -మెయిల్స్ క్లిక్ చేయకపోవడం, బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం, సురక్షితమైన నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించడం వంటి ముఖ్యమైన భద్రతా సూచనలను వివరించారు. సైబర్ మోసానికి గురైనప్పుడు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంక్ సీఈవో నాగభూషణం వందే సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రవి నాయుడుని సత్కరించారు.

మరిన్ని వార్తలు