శక్తిమంతమైన స్థాయికి క్రియేటర్లు
- సామాజిక అభ్యున్నతికి డిజిటల్‌ను వినియోగించాలి
- మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): నేటి డిజిటల్ యుగంలో క్రియేటర్లు కేవలం వినోదానికి పరిమితం కాకుండా సమాజ అభిప్రా యాలను ప్రభావితం చేసే శక్తిమంతమైన స్థాయికి ఎదిగారని తెలంగాణ మైనార్టీ సంక్షే మ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నా రు. ప్రభావంతోపాటు బాధ్యత కూడా ముఖ్యమని, తమ వేదికలను విద్య, సాధికారత, సామాజిక అభ్యున్నతికోసం వినియోగించాలని క్రియేటర్లకు పిలుపునిచ్చారు. సృజనాత్మక తతోపాటు బాధ్యతను ప్రతిబింబించే డిజిటల్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తమ లక్ష్యమని హైబీజ్ టీవీ, తెలుగు నౌ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్, డాక్టర్ జె. సంధ్యారాణిలు ప్రకటించారు.
ఆదివారం హైబీజ్ టీవీ ఆధ్వర్యంలో నగరంలోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో డిజిటల్ మీడియా అండ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అవార్డ్స్ రెండో ఎడిషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అజాహారుద్దీన్‌తోపా టు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణిప్రసాద్, భారతీ సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, ఎన్ స్పోర్ట్స్ డైరెక్టర్ అండ్ సీఈవో దీప్తి అక్కి, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ జీఎం మార్కెటింగ్ చేతన్ గౌరవ అతిథులుగా పాల్గొనగా, 10మందికిపైగా డిజిటల్ మీడియా ప్రముఖులు, 40కి పైగా సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లను డిజిటల్ కంటెంట్‌లో విశిష్ఠ ప్రతిభ కనబర్చినందుకు సత్కరించారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు గగన్ విహారి, జబర్దస్త్ వర్షా హాజరయ్యారు. ప్రతిభ దక్కించుకున్న ఇన్‌ఫ్లూయెన్సర్లలో తెలంగాణకు చెందిన అక్కి చెర్రీ తొలి స్థానం, సుకృతిస్ హోమ్ ద్వితీయ స్థానం, శ్రవణ్ డైమండ్ తృతీయ స్థానం సాధించారు.






