జంగంపల్లి ఎర్రయ్య స్మారకార్థం క్రికెట్ పోటీలు
01-03-2026 04:46 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం దుగ్నపల్లిలో జంగపల్లి ఎర్రయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు ఆదివారం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను టీపీసీసీ రాష్ట్ర కో కన్వీనర్ నాతరి స్వామి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. 40 టీములు 12 రోజులు గా ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటాయి. కుటుంబ సభ్యులు జంగపల్లి చంద్రశేఖర్, దుగ్నెపల్లి మాజీ సర్పంచ్ జుమ్మిడి భానయ్య, బట్వన్ పల్లి సర్పంచ్ సింగతి రాజేష్, మాలగురిజాల కాంగ్రెస్ యూత్ నాయకులు గోమాస శ్రీకాంత్, దుగ్నెపల్లి ఉపసర్పంచ్,ఎర్రయ్య కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.




