బోథ్‌లో భారీ వర్షం— తడిసిపోయిన పంట
విరిగిన విద్యుత్ స్తంభాలు.. రోడ్డుపై పడిన భారీ వృక్షాలు
బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలో మంగళవారం ఉదయం 9 గంటలకు కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. చేలలో కుప్పలుగా పోషించిన మొక్కజొన్న జొన్న పంటలు తడిసిపోగా ఈదురుగాల ప్రభావానికి పంట నేలపై పడిపోయింది. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మండలంలోని .దన్నూర్, పిప్పలదరి ,మరల పల్లి. బోత్ గ్రామాలలో గంటపాటు భారీ వర్షం కొరడం వల్ల రోడ్లపైనే విద్యుత్ స్తంభాలు విరిగి పడి పోవడంతో పాటు వారి వృక్షాలు రోడ్డు గడ్డంగా పడిపోయాయి. దీంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించారు. అకాల వర్షంతో తీవ్ర నష్టం సంబంధించింది.






