28 July, 2026 | 7:54 PM

తీరాన్ని తాకిన రెమాన్ తుఫాను

27-05-2024 01:17 AM

న్యూఢిల్లీ, మే 26: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాన్ తుఫాను పశ్చిమబెంగాల్ సమీపంలో తీరం దాటింది. ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా, ఖేపుపారా ప్రాంతాల నుంచి ప్రయాణించిన తుఫాను.. పశ్చిమబెంగాల్ తీరంలోని సాగర్ దీవుల్లో తీరం దాటినట్లు కేంద్ర వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెమాల్ తుఫాను తీరం దాటడంతో పశ్చిమబెంగాల్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో 200 మిల్లీమీటర్ల వర్షపాతం కురవనుందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 21 గంటల పాటు సర్వీసులను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 394 సర్వీసులను రద్దు చేయ నుండగా, వాటిలో 28 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. 63 వేల మంది ప్రయా ణికులపై ప్రభావం పడనుంది. తుఫాన్ ప్రభావంతో ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.