28 July, 2026 | 8:38 PM

పులుల లెక్క తేలింది

27-05-2024 01:09 AM

తాడోబా అభయారణ్యంలో 55 పులులు, 17 చిరుతలు

మహారాష్ట్ర, మే 26 : మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తాడోబా అభయారణ్యంలో బుద్ధ పౌర్ణిమ వేళ వన్యప్రాణుల గణన చేపట్టారు. వివరాలను అధికారులు వెల్లడించారు. బఫర్ జోన్‌లో 1,917, కోర్ క్షేత్రంలోని ఐదు జోన్లలో కలిపి 3,092 వన్యప్రాణులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వాటిలో 55 పులులు, 17 చిరుతలు, 1,458 జింకలు, 65 ఎలుగుబంట్లు, 1,059 కోతులతో పాటు ఇతర జంతువులను గుర్తించారు. ఇవే కాకుండా లెక్కకు రాని మరిన్ని జంతువులు కూడా ఉన్నట్లు ప్రకటించారు. కాగా, అభయారణ్యంలోని బఫర్ జోన్‌లో 79 కంచెలు ఏర్పాటు చేసి 180 మంది వ్యన్యప్రాణి సంరక్షకులను నియమించారు.