13 July, 2026 | 5:22 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

నాన్న సినిమాను పసిపాపలా చూసుకుంటారు

13-05-2025 12:00 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితి శంకర్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది.

“నా తొలి తమిళ్ సినిమాను డైరెక్టర్ విజయ్ చూశారు. తర్వాత ‘భైరవం’లో క్యారెక్టర్‌కు నేనైతే బాగుంటుందనుకున్నారట. అలా ఈ ప్రాజెక్టులోకి వచ్చా. భాషాపరంగా ఇబ్బంది అవుతుందేమోనని ముందు భయపడ్డా. కానీ డైరెక్టర్‌తోపాటు రైటర్ సత్య సహకరించడం వల్ల ఈ ప్రయా ణం సాఫీగా సాగింది. -ఇందులో నేను బోల్డ్ అండ్ హానెస్ట్, బబ్లీ క్యారెక్టర్‌లో కనిపిస్తా. అంతేకాదు అది నా ఒరిజినల్ క్యారెక్టర్‌కు దగ్గరగానే ఉంటుంది.

ఇందులోని ముగ్గురు హీరోలతో పనిచేయడం సరదాగా అనిపించింది. మనోజ్ నాకు ముందే తెలుసు. ఆయన నన్ను సెట్‌లో చూసి షాక్ అయ్యారు.. ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగారు. ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పా. అది రియల్లీ ఫన్ మూమెంట్. మా నాన్నతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకు వచ్చేదాన్ని. ఇప్పుడు నా సొంత సినిమా షూటింగ్ కోసం రావడం కలగా ఉంది.

ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ కూతురిగా నన్ను నేను నిరూపించుకునే క్రమంలో నాన్న ఇమేజ్‌ను ఒక గౌరవంగానే భావిస్తా.. ఒత్తిడిగా అనుకోను. నేను చేస్తున్న సినిమా కథలేమీ నాన్నకు తెలియదు. తన సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఆయన సినిమాల విశేషాలు కూడా నాకు చెప్పరు. ఆయన సినిమాను ఒక పసిపాపలాగా జాగ్రత్తగా చూసుకుంటారు.

నేను ప్రతిదీ అమ్మకే చెప్తుంటా. నా సినిమాలు చూసే విషయంలో మాత్రం నాన్నకు మరో ఆప్షన్ లేదు. చూడకపోతే ఆయనతో కొట్లాడతా (నవ్వుతూ).- -నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలు చేయాలని ఉంది. ఛాలెంజింగ్ ఉమెన్ క్యారెక్టర్స్ చేయాలనుంది” అని చెప్పింది.