calender_icon.png 31 May, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సతీ లీలావతి డబ్బింగ్ షురూ

13-05-2025 12:00:00 AM

లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్, దుర్గాదేవి పిక్చర్స్ పతాకాలపై నాగమోహన్ నిర్మిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను తెలియజేస్తూ వినోదం, భావోద్వేగ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టీమ్ తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి వేసవి కానుకగా ఈ సినిమాను చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: బినేంద్ర మీనన్; సంగీతం: మిక్కీ జే మేయర్; ఎడిటర్: సతీశ్ సూర్య.