వేల మైళ్ల దూరం... మానవత్వానికి దగ్గరే

17-09-2026 | 12:23pm

సత్తుపల్లి,సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): సత్తుపల్లికి చెందిన చిన్నారి ఛార్లెస్ ఫిన్నీ బ్లడ్ క్యాన్సర్‌(Charles Finneys blood cancer)తో పోరాడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చల్లగుళ్ల నరసింహారావు  కుమారుడు చల్లగుళ్ల నిఖిల్.వెంటనే స్పందించి రూ.10వేల ఆర్థిక సహాయం అందించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. సత్తుపల్లి చిన్నారి పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించడం నిఖిల్  మానవత్వానికి నిదర్శనం. 

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి,వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత అందించడం నిజమైన మానవత్వానికి ప్రతీక. అవసరమైన సమయంలో అందించే ప్రతి సహాయం బాధిత కుటుంబానికి ఎంతో విలువైనదే.నిఖిల్ చేసిన ఈ మానవతా సహాయం మరికొందరికి స్ఫూర్తిగా నిలిచి, చిన్నారి వైద్యానికి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చేలా చేయాలి.దూరం ఎంత ఉన్నా.. మానవత్వంతో స్పందించే మనసుకు హద్దులు ఉండవు.చల్లగుళ్ల నిఖిల్  మానవతా స్పందనకు అభినందనలు

మరిన్ని వార్తలు