15 June, 2026 | 10:16 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

డీఏలను విడుదల చేయాలి

17-02-2026 07:45 PM

- STU TS జిల్లా అధ్యక్షుడు 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న DA లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU TS) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బట్టారి వెంకటేశ్వర్లు కోరారు. మంగళ వారం stu ts కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రధాన కార్యదర్శి ఓడిగె కృష్ణతో కలిసి మాట్లాడుతూ... PRC ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. CPS విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని,

ఉద్యోగుల ఆరోగ్య పథకంకి సంబంధించి ఉద్యోగుల యొక్క చందాను జీతంలోని బేసిక్ పై శాతంలో కాకుండా అందరికీ ఒకేవిధంగా నిర్దిష్ట మొత్తాన్ని తీసుకునేలా ఉండాలన్నారు.  మెడికల్ బిల్లులు, సరెండర్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చీపెల్లి బాపు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అర్షేనపల్లి సత్తయ్య, జిల్లా కార్యదర్శి B.మన్మోహన్ , ఆర్థిక కార్యదర్శి M.సుమన్ , మంచిర్యాల మండల ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.