calender_icon.png 8 June, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో కంచి కామకోటి పీఠాధిపతి వర్ధంతి(జయంతి) ఉత్సవాలు

07-06-2025 06:24:03 PM

భద్రాచలం (విజయక్రాంతి): కంచి కామకోటి పీఠం పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి 132వ వర్ధంతి (జయంతి) మహోత్సవములు జూన్ 9, 10, తేదీలలో భద్రాచలంలో అంబసత్రమునందు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కంచి కామకోటి పీఠం నుండి వచ్చే రుత్వికులు వేద పండితులచే నిర్వహించబడును. జూన్ 9 తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పూజ కలశస్థాపన హోమం, ఉదయం 9 గంటలకు నవ వర్ణ పూజ 12 గంటలకు 30 నిమిషాలకు తీర్థప్రసాదములు సాయంత్రం 4.00 గంటలకు గణపతి నవగ్రహ నక్షత్ర శ్రీరామచంద్రమూర్తి సీతామాత శ్రీలక్ష్మి శ్రీ ఆంజనేయ హోమములు మహా పూర్ణాహుతి అనంతరం మహాదీపారాధన సాయంత్రం 5.00 గంటలకు శ్రీ సూక్త పురుష సూక్త విష్ణు సహస్రనామాలు శ్రీ విద్యా రామమూర్తి హోమం పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

అలాగే జూన్ 10వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి గోపూజ, దంపతి పూజ, బాల, కన్య కుమారి, సుహాసిని 108 మంది స్త్రీలకు పూజలు. మధ్యాహ్నం 12:30 కి తీర్థ ప్రసాదములు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కన్నలూరి సుధాకర శర్మ (మహాపెరియావా సేవా మైయం) తేరాల మణికంఠ సోమయాజి(శ్రీ దేవీ శ్రీ విద్యా పీఠం) నిర్వహిస్తారు. స్థానికంగా ఈ కార్యక్రమం విజయవంతానికి ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యాయవాది డా. వనం కృష్ణవేణి, ఆదిత్య సరస్వతీ కుమార్ కృషి చేస్తున్నారు. కావున భద్రాచలం భగవద్భక్తులు రెండు రోజులు మహాస్వామి వారి జయంతోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా, ఆర్థిక, హార్దిక సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు.