12 June, 2026 | 1:36 AM

దీవాన బ్యూటిఫుల్ టైమ్‌లెస్ లవ్‌స్టోరీ

12-06-2026 12:49 AM

‘శుభం’ ఫేమ్ హర్షిత్‌రెడ్డి హీరోగా నటి స్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడి యోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి వెండితెరకు పరిచయం కాను న్నారు. ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూ టర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది.

ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో విశ్వక్‌సేన్, నిర్మాత ధీరజ్ మొగిలినేని అతిథులుగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడు తూ.. “శ్రీకాంత్ గంటన్నర కథ చెప్తే.. ఒక సీన్ డెమో అడిగా. ఒక సీన్ ఫుటేజ్ పంపారు.. దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడనే నమ్మకం నాలో కలిగింది. హీరో హర్షిత్.. ఆమిర్‌ఖాన్ పెద్ద హైట్ కాదు కానీ, నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు.

హర్షిత్ కూడా గుర్తింపు తెచ్చుకో వాలి. ‘దీవాన’ సున్నితంగా ప్రారంభమై మన హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ప్రేమకథ” అన్నారు. విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “సినిమా బాగున్న ప్పుడే టీమ్ మొత్తం కాన్ఫి డెంట్‌గా ఉంటారు. అలాంటి కాన్ఫిడెన్స్ దీవాన మూవీ టీమ్‌లో కనిపిస్తోంది” అన్నారు. కథానాయకుడు హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. “దీవాన’ సినిమా ఏ ట్రెండ్ ఫాలో కాదు, ఏ రిఫరెన్స్‌నూ తీసుకోలేదు, ఏ ఫార్ములానూ ఉపయోగించలేదు. మేము తీసుకున్న పాయింట్ తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా రాలేదు. అదే మా కాన్ఫిడెన్స్.

ఇది టైమ్ లెస్ లవ్‌స్టోరీ. కథ విన్నప్పటి నుంచి ఎప్పుడు చేద్దామా అనే ఉత్సాహంలో ఉన్నాం. చేస్తూ నవ్వుకున్నాం, ఏడ్చాం, తిట్టుకున్నాం, ‘దీవాన’ అయిపోయాం. అందుకే ‘దీవాన’ అనే టైటిల్ పెట్టాం” అని చెప్పారు. హీరోయిన్ స్మేహ మణిమేగలై మాట్లాడుతూ.. “ఈ సినిమా అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది” అని తెలిపింది. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రేక్షకుల టైమ్‌కు, సెన్స్‌కు, టేస్ట్‌కు రెస్పెక్ట్ ఇస్తుంది.

సినిమాలు చూడాలనే లవ్‌ను మళ్లీ పుట్టించే సినిమా ‘దీవాన” అని తెలిపారు. నిర్మాత వాసుదేవ్ కొప్పినేని మాట్లా డుతూ.. “ఈ సినిమాలో వన్ సైడ్ లవ్ చూపిస్తున్నాం. ఈ ప్రేమ, నాకు సినిమా మీద ఉన్న ప్రేమ ఒకేలా అనిపించింది. షూటింగ్ బాగా జరిగితే హ్యాపీగా ఫీల య్యేవాడిని. ఇబ్బంది వస్తే డిజ ప్పాయింట్ అయ్యే వాడిని. సినిమా మేకింగ్ కూడా లవ్‌లో ఉన్నట్లు అనిపిం చింది.

సినిమా చూస్తే ప్రేక్షకులు ఒకరకమైన భావోద్వేగానికి గురవుతారు” అని తెలిపారు. మరో నిర్మాత శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ.. “మా సిని మా ఏ జానర్ అంటే గుండెల్ని పిండేసే జానర్ అని చెబుతా” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక బృందం కూడా మాట్లాడారు.