29 July, 2026 | 5:59 PM

ఆర్మూర్ లో వన మహోత్సవం

29-07-2026 05:27 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుండ్ల చెరువు వద్ద  బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజు, కౌన్సిలర్లు మొక్కలు నాటారు. చైర్ పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి ఆక్సిజన్ లాంటిది అన్నారు. ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలంటే సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పర్యావరణం, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇదే మానవ మనుగడకు ఎంతో అవసరం అన్నారు.  నానాటికి కాలుష్యం పెరిగిపోతుంది కావున, రాబోయే భవిష్యత్ తరాలు బాగుండాలన్న, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్న దానికి పరిష్కారం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, టీపీసీసీ  అధికార ప్రతినిధి శ్రీనివాస్ చిన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేందర్, నర్మే నవీన్, సడక్ వినోద్, బొప్పేన ప్రసాద్, నాయకులు శాల ప్రసాద్, సుమన్, గంగూలీ, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ డిఈ, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.