యూత్ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?
29-07-2026 05:09 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలైన ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీలు, యూత్ కమిషన్, వడ్డీ లేని విద్యా రుణాలు, ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు తదితర హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.






