విద్యార్థులకు ఇబ్బంల్లేకుండా చూడాలి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, డీఎల్ పీఓ అనిత
మునిపల్లి,(విజయక్రాంతి): కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషలాఫీసర్ రామాచారి, డీఎల్ పీఓ అనితలు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే మండలంలోని బుదేరా చౌరస్తాలోగల గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి వారు సందర్శించి కళాశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు పడుతున్నందన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్ పుణ్య శైలజకు సూచించారు.
ముఖ్యంగా వంట శాలలో ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలన్నారు. అలాగే విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. అంతకు ముందు విద్యార్ధులతో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి రుచి చూసి అద్యాపక బృందాన్ని అభినందించారు. అనంతరం భోజన శాల నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర వాటిపై ప్రిన్సిపాల్ పుణ్య శైలజను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీఓ కృష్ణ కుమార్, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి , అద్యాపక బృందం తదితరులు ఉన్నారు.






