వరి, మొక్కజొన్న కొనుగోలులో జాప్యం
22-05-2026 02:01 AM
అలంపూర్ మే 21: వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం మౌలిక వసతులు తరుగు తేమ పేరుతో దోపిడిని అరికట్టి రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేపట్టాలని బిజెపి మండల అధ్యక్షుడు కనికి శశి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాజోలి మండల కేంద్రంలోని డిటి రమణను స్థానిక నాయకులతో వినతి పత్రాన్ని సమర్పించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గత 50 రోజులుగా గోనే సంచులు ఇవ్వక లారీల కొరతతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని మండిపడ్డారు. నెలలు గడిచిన రైతులకు తమ అకౌం ట్లలో డబ్బులు జమ కావడంలేదని ఆరోపించారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.






