22 May, 2026 | 2:57 AM

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

22-05-2026 02:05 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట, మే 21: ఉపాధి హామీ పనులు, ధాన్యం కొనుగోళ్లు, జనగణ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. గురువారం లింగాల మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, జనగణ సర్వే, ఉపాధి హామీ పనులను పరిశీలించారు.

సూరాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న భూమి చదును పనులను పరిశీలించి కూలీలకు ఎక్కువ రోజులు పని కల్పించాలని అధికారులకు సూచించారు. ఉదయం 5:30 గంటలకే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జూన్ 30 వరకు ప్రస్తుత ఉపాధి పథకం కొనసాగుతుందని, జూలై 1 నుంచి వీబీజీ రామ్ పథకం అమల్లోకి రానుందని తెలిపారు.