11 June, 2026 | 2:04 AM

ఆలస్యంగా నైరుతి రుతుపవనాల విస్తరణ

11-06-2026 01:20 AM

పలు జిల్లాల్లో రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఆలస్యం కానుంది. పూర్తి స్థాయిలో విస్తరించేందుకు మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గురు, శుక్రవారాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.