పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
11-06-2026 01:22 AM
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మల్కాజిగిరిలోని వెంకటేశ్వర నగర్ శ్రీదేవి ఫంక్షన్ హాల్‌లో బుధవారం బూత్ స్థాయి బీఎల్‌ఏల సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు స మీర్ కౌశల్ హాజరయ్యారు.
డివిజన్ బీఎల్‌ఏలు సమావేశంలో అందించబడే మార్గదర్శకాలు, సూచనలు, అమూల్యమైన సలహా లను స్వీకరించి తమ తమ బూత్‌లలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్‌కుమార్, మల్కాజిగిరి ఇంచార్జీ తోట లక్ష్మీ కాంత్‌రెడ్డి, సీనియర్ నేతలు చంద్రశేఖ ర్, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బికే శ్రీనివాస్, గుండా నిరంజన్, జిఎన్‌వి సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్ పాల్గొన్నారు.






