29-09-2025 01:32:46 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఉపకార వేతనాలతో తన ఆశ్రమానికి చెందిన కళాశాలలో చదువుతున్న పేద, మధ్యతరగతి యువతులను లైంగికంగా వేధించిన స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ ఢిల్లీ బాబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో గల శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండి యా మేనేజ్‌మెంట్ కళాశాల డైరెక్టర్‌గా కొనసాగిన బాబా అదే అదను గా కళాశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి యువతులను లైంగిక వేధింపులకు గురి చేశాడు.
యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా బాబా పరారయ్యాడు. పోలీసులు ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి ఆగ్రాలోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన నిధులనూ దుర్వినియోగం చేసినట్టు ఆయనపై కేసు నమోదైంది. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే దొంగ పాస్‌పోర్ట్ సంపాదించి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి.