29-09-2025 01:34:17 AM
-అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్
-కోచ్‌గా చేసిన అనుభవం మన్హాస్ సొంతం
ముంబై, సెప్టెంబర్ 28: దేశవాళీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా పదవి చేపట్టబోయే మన్హాస్ ఒక్కటంటే ఒక్కటి కూడా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. 45 ఏండ్ల మన్హాస్ ఢిల్లీ తరఫున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 130 లిస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మిథున్ ఢిల్లీ డేర్‌డేవిల్స్, పూనే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. మిథున్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకున్నా కానీ కోచ్‌గా చేసిన అనుభవం సంపాదించాడు. ఐపీఎల్ 2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అంతే కాకుండా బంగ్లాదేశ్ అండర్‌ెే19 జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంటింగ్‌గా కూడా వ్యవహరించాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు.