3 May, 2026 | 7:38 PM

దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌కు డిమాండ్

15-10-2024 03:25 AM

యువత నుంచి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): దుబాయ్‌లో డెలివరీ బాయ్స్ కు అధిక డిమాండ్ ఉందని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సీఈవో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుం దని పేర్కొన్నారు. సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో టామ్ కామ్ అభ్యర్థులకు సహాయం చేస్తుందని స్పష్టం చేశారు.

కనీసం ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత కలిగి ఉండి, తప్పనిసరి గా పాస్‌పోర్ట్, మూడేళ్ల భారతీయ ద్విచ క్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయో పరిమితి గల వారు ఈ ఉద్యోగాలకు అర్హులని సూచించారు. జొమాటో, స్విగ్గీ, ఏదైనా ఫుడ్ డెలివరీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కరీంనగర్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదురు గా ఉన్న శ్వేతా హోటల్‌లో 17వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 94400 51285, 94400 48500, 97010 40062, 94400 51452 నం బర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.