సురేష్ బాబు తోటమళ్లను అభినందించిన డీఈవో వెంకటేశ్వర చారీ
02-06-2025 08:48 PM
భద్రాచలం (విజయక్రాంతి): తేగడ హైస్కూలులో ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రపంచ సాహితీ సదస్సులో పాల్గొని కవిరత్న జాతీయ పురష్కారం పొందడం సంతోషకరం అని డీఈవో వెంకటేశ్వర చారీ(DEO Venkateswara Chari) అన్నారు. సోమవారం తన కార్యాలయంలో సురేష్ బాబుని అభినందించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్, వివిధ రంగాలలో పలు అవార్డులు సాధించి పదో తరగతి పరీక్ష ఫలితాలలో సైన్స్ నందు నూరు శాతం సాధించి జిల్లా విద్యా శాఖకు మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు.






