02-06-2025 08:53:51 PM
భూత్పూర్: టిఆర్ఎస్ అధినేత కేసిఆర్(TRS chief KCR) పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి(Former MLA Alla Venkateswara Reddy) అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana State Formation Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసిఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బస్వా రాజ్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు గౌడ్, సాయిలు, సత్యనారాయణ, అశోక్ గౌడ్, సత్యం, ఫసి, సాదిక్, సురేష్ గౌడ్, సాకీర్, వెంకటేష్, రామకృష్ణ, ప్రేమ్ కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.