29 August, 2026 | 9:28 PM

భూపాలపల్లి ఏరియాలో డిపార్ట్మెంటల్ క్రీడలు

29-08-2026 08:56 PM

పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్

సెప్టెంబర్ 1 నుండి నిర్వహించనున్నట్లు వెల్లడి

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణి భూపాలపల్లి ఏరియాలో 2026, 27 సంవత్సరానికి సంబంధించి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 21వ తేదీ వరకు కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలు స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియంలో సెప్టెంబర్ 1న ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతాయని సంబంధిత గనుల, విభాగాల ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ కోరారు.