29 August, 2026 | 9:24 PM

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

29-08-2026 08:53 PM

* క్రీడలతోనే శారీరక, మానసిక ఉల్లాసం

* ప్రభుత్వ బడిలో క్రీడా పోటీలు

* విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమే 

* బందనకల్ సర్పంచ్ నరేష్

ముస్తాబాద్,(విజయక్రాంతి): హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు  పర్షరాములు పర్యవేక్షణలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిగురు నరేష్ తో పాటు వార్డు సభ్యులు వెంకటరెడ్డి, యాదగిరి గౌడ్ హాజరై ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల క్రీడా పోటీలను తిలకించారు. వివిధ క్రీడాంశాలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

క్రీడా పోటీల నిర్వహణకు ప్రోత్సాహంగా బహుమతులు అందించిన యువజన సభ్యులు ఎనగందుల, నర్సింలు, నరేష్, మోట్ల వెంకటేష్ లను అభినందించారు. తదుపరి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యమైనవని, క్రీడల ద్వారా మానసిక శారీరక ఉల్లాసం, క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలలు పెంపొందుతాయని విద్యార్థులకు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్బంగా ఈ క్రీడలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ధ్యాన్చంద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడారంగంలో రాణిస్తూ బాగా చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట గోపాల చారి, సత్యనారాయణరావు, శారదాదేవి, రాములు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు