రేపు బాన్సువాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
29-08-2026 08:59 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీలు,ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందనీ విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు. విద్యుత్ లైన్లలో మరమ్మతులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాడ్కోల్ రోడ్డు, వాసవి కాలనీ, కోట గల్లి, బీడీ కాలనీ, ఆర్ఫత్ కాలనీ, ఫిర్దోస్ కాలనీ, బాలాజీ నగర్, కొయ్యగుట్ట రోడ్డు ప్రాంతాలతో పాటు సంగమేశ్వర కాలనీలోని 3వ, 4వ రోడ్లలో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.విద్యుత్ లైన్ల మరమ్మతులు, కొత్త పోల్స్ ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని ఏఈ సంతోష్ కుమార్ కోరారు.






