16 April, 2026 | 9:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జిల్లా వ్యాప్తంగా ఉపముఖ్యమంత్రి పుట్టినరోజు సంబరాలు

15-06-2025 06:07 PM

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు(Deputy CM Mallu Bhatti Vikramarka) జన్మదిన పురస్కరించుకొని ఆదివారం జిల్లావ్యాప్తంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాల్వంచ మండల కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షులు మెంటం రాము ఆధ్వర్యంలో బర్త్ డే కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ మాట్లాడుతూ బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రం యావత్తు పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించి, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంభం వల్ల దగాపడ్డ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న నేత బట్టి అన్నారు.