19 August, 2026 | 2:21 PM

ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

15-06-2024 11:52 AM

హైదరాబాద్: ప్రజాభవన్ లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పోచమ్మ తల్లి ఆలయంలో భట్టివిక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో 50 కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భట్టి విక్రమార్కకు పలువురు నేతలు, ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.