19 August, 2026 | 1:16 PM

జీ-7 సమ్మిట్‌.. మోదీ, మెలోని సెల్ఫీ వైరల్‌

15-06-2024 12:15 PM

న్యూఢిల్లీ: జీ-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీలోని అపులియాలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం మెలోని తీసిన చిత్రంలో ఇద్దరు నేతలు నవ్వుతూ కనిపించారు. గత ఏడాది కూడా, దుబాయ్‌లో జరిగిన 'క్యాప్28' వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు తీసుకున్న సెల్ఫీ ఇంటర్నెట్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే.  జీ-7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ శుక్రవారం తెల్లవారుజామున ఇటలీ చేరుకున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. జీ-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరిపి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.